
ధాన్యం కొనుగోళ్లకు
న్యూస్‌రీల్
కొనుగోలు కేంద్రాల
ఏర్పాటుకు చర్యలు
జిల్లాలో 176 కేంద్రాల ఏర్పాటు
ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం..
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ములుగు రూరల్: వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాగు చేసిన వరి విస్తీర్ణానికి అనుకూలంగా దిగుబడి అంచనా వేశారు. ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టనున్నారు. ధాన్యం సేకరణకు అవసరమయ్యే యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచారు. నిబంధనల మేరకు ధాన్యం మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు, వ్యవసాయ అధికారులకు సూచనలు అందించారు.
1.35 లక్షల ఎకరాల్లో వరిసాగు
జిల్లాలోని పది మండలాల్లో 1.35లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాకు 22 క్వింటాల దిగుబడి అంచనా వేస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వరి దిగుబడి 2.970 మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి రానుంది. ఈ మేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యం నిర్ధేశించారు.
46 లక్షల గన్నీ బ్యాగుల అవసరం
జిల్లాలో ధాన్యం సేకరణకు 46 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నాయి. దీంట్లో 30.39 లక్షల గన్నీ బ్యాగుల అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూర్పార పట్టే యంత్రాలు, తేమశాతం నిర్ధేశించే పరికరాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు, టార్ఫాలిన్లు సిద్ధం చేస్తున్నారు.
ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 176 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, గిరిజన సహకార సంఘాలు, ఐకేపీ, ఎఫ్‌పీఓల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించారు. ఆయా సంఘాలకు కేంద్రాలను కేటాయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో –93, జీసీసీ 16, ఐకేపీ –61, ఎఫ్‌పీఓ–6 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు చేపట్టనున్నారు.
1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
సేకరణ లక్ష్యం
అందుబాటులో గన్నీబ్యాగులు
ధాన్యం సేకరణకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ చేపడుతాం. సేకరణకు సరిపడా గన్ని బ్యాగులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచాము. కాంటాలైన వెంటనే జాప్యం లేకుండా ధాన్యం మిల్లులకు తరలిస్తాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యం అమ్మకాలు చేపట్టాలి. దళారులను నమ్మి మోసపోవద్దు.
– ఫైజల్ హుస్సేని, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి

ధాన్యం కొనుగోళ్లకు

ధాన్యం కొనుగోళ్లకు

ధాన్యం కొనుగోళ్లకు