
లాభం వస్తుందని సాగు చేశా..
మిర్చి పంటను సాగు చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు. గత రెండేళ్ల నుంచి మిర్చి సాగు చేయడం వల్ల అపార నష్టం వచ్చింది. వేరే విద్య తెలియక మళ్లీ మిర్చి సాగువైపే అడుగులు వేశాం. ఎనిమిది ఎకరాల వరకు మిర్చి సాగు పెట్టాను. గత రెండేళ్ల నుంచి వస్తున్న నష్టాన్ని ఈసారి పూడ్చుకోవాలని గంపెడు ఆశతో పంట సాగు చేశాను. కానీ వ్యాపారులు, ప్రభుత్వం ఏం చేస్తుందో అర్ధం కావడం లేదు. మిర్చి నారు వేసి మల్చింగ్ పేపర్‌ను అమర్చాము. కాని కాత కాసి మార్కెట్ వెళ్లే వరకు ఆందోళనగానే ఉంటుంది.
– గడ్డం బాబు, రామన్నగూడెం, మిర్చి రైతు