
రెండేళ్లుగా నష్టాలే..!
మిర్చి పంటను ఆశిస్తున్న చీడపీడలు
సాధారణ పద్ధతిలో సాగు చేసిన మిర్చి చేను
మల్చింగ్ విధానంలో సాగు చేసిన మిర్చి మొక్కలు
ఏటూరునాగారం: జిల్లాలోని నల్లరేగడి భూముల్లో ఎర్రబంగారాన్ని ఎక్కువగా పండిస్తున్నారు. గోదా వరి పరీవాహక ప్రాంతాల్లో మిర్చిని వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతన్నలు రెండేళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. ఆ నష్టాలను ఈ ఏడాది పూడ్చాలని ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ ఏడాదైనా మిర్చి పంటను మరింత సాగు చేసి గత నష్టాన్ని అదిగమించాలని దేవుడిని వేడుకుంటున్నారు. కాని వర్షాకాలం ముగిసినప్పటికీ కూడా వానలు కురుస్తుండడంతో రైతన్నలు ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో మొక్కేత(మొక్కలను నాటడం) చేయలేదు. ఏడాది పొడువునా సాగు చేసుకునే వాణిజ్య పంట మిర్చి సాగు. ఎండు మిరపను ఖరీఫ్, రబీ కాలాల్లో నాటితే పచ్చి మిర్చిని మాత్ర అన్ని కాలల్లో సాగు చేస్తుంటారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ మార్కెట్‌లో సరైన ధరలు లేక రైతులు నష్టాల పాలవుతున్నారు. రైతులకు ఎకరాకు 15 నుంచి 30 క్వింటాల్ వరకు దిగుబడి వస్తే వారు నష్టాల నుంచి బయటపడతారు. మిర్చి పంటను ఆశిస్తున్న చీడపీడల నుంచి పంటను రక్షించుకునేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు పలు సూచనలను చేస్తున్నారు.
ఎకరానికి మూడు లక్షలు
ఒక ఎకరంలో మిర్చి సాగు చేయడానికి రూ.3 లక్షల పెట్టుబడి అవుతుంది. మిర్చి విత్తనాల కొనుగోలు, కౌలు, నీటి పారకం, బలం మందులు, మొక్కలను నాటడం, రసాయన మందులు, డ్రిప్ అమర్చడం, మల్చింగ్ పేపర్‌లకు పెట్టుబడి కేటాయించాల్సి ఉంది. ఈ విధంగా ఒక్కో రైతు ఒక్కో ఎకరానికి రూ.3 లక్షలు వెచ్చిస్తే గాని మిర్చి దిగుబడి రాని పరిస్థితి ఉంటుంది. ఇలా దిగుబడి ఎకరానికి 15 నుంచి 30 క్వింటాల వరకు వస్తేనే రైతు పెట్టుపెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశాలున్నాయి. అంతకంటే తక్కువ దిగుబడివస్తే పెట్టుబడి కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోతాయి.
మార్కెట్‌లో సరైన ధరలు కరువు
నష్టాలను చవిచూస్తున్న రైతులు
మల్చింగ్ విధానం మేలు అంటున్న నిపుణులు

రెండేళ్లుగా నష్టాలే..!