
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ములుగు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మేడారంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, బీజేపీలు పని కట్టుకొని విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేసిందన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారు రూ. 30 కోట్ల సీడీఎఫ్ నిధులతో దళిత గిరిజన వాడల్లో సీసీ రో డ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణంతో పాటు ఏటూరునాగారంలో బస్‌డిపోకు రూ.80 కోట్లతో టూరిజం డెవలప్‌మెంట్, పంచా యతీరాజ్ శాఖ నుంచి బీటీ రోడ్ల పనులకు సుమారుగా రూ. 310 కోట్లు నిధులు కేటాయించి పనులను ప్రారంభించామని వివరించారు. నాయకులు, కార్యకర్తలకు మధ్య విబేధాలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికే స్థానిక ఎన్నికల్లో టికెట్లు వస్తాయని వెల్లడించారు. ముందుగా మంత్రి సీతక్క పార్టీ నాయకులతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సీతక్కను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర చైర్మన్ అర్రెం లచ్చుపటేల్, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ములుగు క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి 48 మంది లబ్ధిదారులకు రూ.63 లక్షల విలువ గల చెక్కులను సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క లబ్ధిదారులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే 20 శాతం కూడా డబ్బులు ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పేదల కోసం 40 శాతానికి పైగా ఆస్పత్రి ఖర్చులను చెల్లిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి