నేటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

Oct 13 2025 8:34 AM | Updated on Oct 13 2025 8:34 AM

నేటి

నేటి ప్రజావాణి రద్దు

ములుగు రూరల్‌: కలెక్టరేట్‌లో నేడు(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

‘ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలి’

ఏటూరునాగారం: ఆదివాసీలు తమ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి జాతీయ కన్వీనర్‌ రమణాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల జాబితా నుంచి లంబాడీల తొలగింపు అంశానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నందున్న వారి అభిప్రాయం మేరకు చేపట్టే ఉద్యమానికి ఆదివాసీ సంఘాలన్నీ మద్దతు తెలుపాలన్నారు. ఆదివాసీ సంఘాల జేఏసీతో కలిసి పనిచేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారని తెలిపారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చందా మహేశ్‌, ప్రధాన కార్యదర్శిగా కాపుల సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎట్టి రాజబాబు, సిద్ధబోయిన సర్వేశ్వర రావు, చింత సోమరాజు, జిల్లా కార్యదర్శులుగా పెండేకట్ల బాలరాజు, కూచుంటి చిరంజీవి, ఈక జగ్గారావు, వట్టం సురేష్‌, పొడెం నర్సింగ రావు, కోశాధికారి సోలం సురేష్‌, ప్రచార కార్యదర్శులుగా వాసం శ్రావణ్‌ కుమార్‌, జవ్వాజి రవి, చింత శ్రావణ్‌, వజ్జ రవి, సాంస్కృతిక కార్యదర్శిగా కోడె రవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కో కన్వీనర్‌ పోడెం రత్నం, యాసం రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్‌ కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర్క యాదగిరి, గంజి రాజన్న, గంట సత్యం, వట్టం కన్నయ్య, రాష్ట్ర కార్యదర్శులు పూనెం శ్రీనివాస్‌, పూనెం బాలకృష్ణ, చింత కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

పాండవుల గుహలను సందర్శించిన విద్యార్థులు

రేగొండ: వరల్డ్‌ హెరిటేజ్‌ వాలంటీర్స్‌ క్యాంపునకు వచ్చిన విద్యార్థులు ఆదివారం మండలంలోని పాండవుల గుహలను సందర్శించారు. పాండవుల గుట్టకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను అసిస్టెంట్‌ టూరిజం ప్రమోషన్‌ అధికారి డాక్టర్‌ కుసుమ సూర్య కిరణ్‌ విద్యార్థులకు వివరించారు. అనంతరం పాండవుల గుహలలోని పలు ప్రదేశాలను తిలకించారు.

మందుబాబులకు అడ్డాగా పాఠశాల

భూపాలపల్లి రూరల్‌:మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్‌పల్లి ప్రాథమిక పాఠశాల రాత్రి సమయంలో మందుబాబులకు అడ్డాగా మారుతుంది. పాఠశాలకు గేటు లేకపోవడం, ప్రహరీ ఓ మూలన కూలిపోవడంతో రాత్రి ళ్లు పాఠశాలలోనే మందుబాబులు మద్యం సేవి స్తున్నారు. పాఠశాలకు గేటు, ప్రహరీని వెంటనే నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నేటి ప్రజావాణి రద్దు 
1
1/1

నేటి ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement