
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఎమ్మార్పీఎస్ జాతీయ నేత, దళిత రత్న నెమలి నర్సయ్య, జిల్లా ఇన్‌చార్జ్ చాతాల్ల రమేశ్ అన్నారు. సోమవారం ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి నుంచి ర్యాలీగా వెళ్లిన నాయకులను, పెన్షన్‌దారులను కలెక్టరేట్ గేటు వద్దనే పోలీసులు నిలిపేశారు. దీంతో పోలీసులకు, ఎమ్మార్పీఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు పెంచి ఇవ్వాలన్నారు. ఇప్పటికై న ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు మంచోదు చంద్రమౌళి, తడుగుల విజయ, వెలుకుర్తి మోహన్‌రావు, మహాజన సోషలిస్టు పార్టీ నాయకుడు కల్లేపల్లి రమేశ్, వికలాంగుల కుల పోరాట సమితి నాయకులు దూడపాక రాజు, కొండి రమేశ్, గజ్జల ప్రసాద్, మరాటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.