
ఉన్నట్టా.. లేనట్టా!
● నాలుగు రోజులుగా కనిపించని పెద్దపులి
● గాలింపు చర్యలు చేపడుతున్న
ఫారెస్ట్ అధికారులు
ములుగు: జిల్లాలో ఐదు రోజుల క్రితం ఆకస్మికంగా దర్శనమిచ్చిన పెద్దపులి జాడ దొరకడం లేదు. ఈనెల 3న ములుగు మండలంలోని పత్తిపల్లిలో పు లి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించా రు. 4న వెంకటాపురం(ఎం) మండలంలోని నర్సాపూర్ శివారులో పెద్దపులి అడుగులను గుర్తించిన అటవీశాఖ అధికారులు పాలంపేట వానగుట్ట వైపు వెళ్లినట్లు చెప్పారు. అప్పటి నుంచి పులి జాడ దొరకడం లేదు. అటవీశాఖ అధికారులు మాత్రం వానగుట్ట సమీపంలోనే ఉందని చెబుతున్నారు. రోజుకు 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు నడిచే పెద్దపులి వానగుట్ట సమీపంలోనే మకాం వేసి ఉందని చె బుతుండడం అనుమానాలకు తావిస్తోంది. గత సంవత్సరం డిసెంబర్ 10న గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించిన బెంగాల్ టైగర్ వెంకటాపురం(కె) మండలంలోని బోదాపూర్ మీదుగా మల్లూరు గుట్టల వైపు వెళ్లినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. 2025 మార్చి 7న వెంకటాపురం(ఎం) మండలంలోని లింగాపూర్ ప్రాంతంలో పులి సంచరించింది. ప్రతీఏటా పులులు జిల్లాలో సంచరిస్తున్నా..వాటికి భద్రత లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో జిల్లా కేంద్రం మీదుగా పులి చర్మాన్ని తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 లో తాడ్వాయి మండలంలో వేటగాళ్ల ఉచ్చులకు గర్భంతో ఉన్న పులి (ఎస్–1) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
వానగుట్టలో వేటగాళ్ల ఉచ్చు..
వానగుట్ట, వరాలగుట్ట ప్రాంతంలో అడవి పందుల కోసం వేటగాళ్లు ఉచ్చులు పెట్టినట్లు అనుమానా లున్నాయి. నాలుగు రోజులుగా పులి జాడ తెలవకపోవడంతో పాటు రైతులు, పశువుల కాపరులు పా దముద్రలు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందిస్తే త ప్ప అధికారులు స్వచ్ఛందంగా తెలుసుకునే పరిస్థి తి కనిపించడం లేదు. అ క్రమ కలప రవాణా, ఇస ుక రవాణాపై రాత్రింబవ ళ్లు విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులకు జిల్లాలో సంచరిస్తున్న పులి ప్రయాణంపై సమాచారం లేకుండాపోయింది. పు లి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారే తప్ప పులి వానగుట్ట ప్రాంతంలో ఉందా.. ఇతర ప్రాంతానికి తరలివెళ్లిందా.. అనే పూర్తి వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. పులి వేటగాళ్ల ఉచ్చులకు బలి కాకముందే గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి, భద్రత చర్యలు చేపట్టాలని వన్యప్రాణుల ప్రేమికులు కోరుతున్నారు.