
మాత్రలు మింగి విద్యార్థినికి అస్వస్థత
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని మేడారం ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పారాసెటమాల్ మాత్రలు (ట్యాబెట్లు) మింగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి... వెంకటాపురం మండలంలోని రామంజపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి సాయిప్రసన్నకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఇంటికి తీసుకెళ్లి వారం రోజుల క్రితం పాఠశాలకు తీసుకువచ్చారు. ఇన్ని రోజులు ఇంటి వద్ద ఏమి చేశావని హిందీ టీచర్ ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఎక్కువ మొత్తంలో జ్వరం ట్యాబెట్లు (పారాసెటమాల్) వేసుకుంది. గమనించిన పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది వైద్య చికిత్స కోసం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై హెచ్‌ఎం సాయిబాబాను వివరణగా కోరగా విద్యార్థి సాయిప్రసన్నకు జ్వరం ఉండటంతో ఇంటికి వెళ్లి వచ్చిందని, తరగతి గదిలో కొంతమంది విద్యార్థినులను ఎఫ్‌ఏ మొదటి యూనిట్ పరీక్ష రాయలేదని, రెండో ఎఫ్‌ఏ యూనిట్ పరీక్ష ఎలా రాస్తారని టీచర్ ప్రశ్నించారు. అంతేగాని సాయిప్రసన్నను మందలించడం, తిట్టిందనే పుకార్లు అవాస్తవమన్నారు.