
చాట్‌బాట్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు: విద్యుత్ వినియోగదారుల కోసం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీజీఎన్పీడీసీఎల్) ఆధ్వర్యంలో వాట్సాప్ చాట్ బాట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ములుగు డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ వాట్సాప్‌లో 7901628348 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపగానే వెల్‌కమ్ టు టీజీఎన్‌పీడీసీఎల్ కాల్ సెంటర్ అని సందేశం అందుతుందన్నారు. వెంటనే రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ వంటి ఆప్షన్లు వస్తాయన్నారు. వినియోగదారులు యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేస్తే వెంటనే విద్యుత్ సర్వీస్ వివరాలు ప్రదర్శించ బడతాయన్నారు. వివరాలను ఓకే చేసిన తర్వాత కంప్లైంట్‌కు సంబంధించిన విభాగాల మెనూ కనిపిస్తుందని, వినియోగదారుడు తాను ఎదుర్కొంటున్న సమస్యను ఎంచుకుని ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే సమస్య పురోగతి ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. సమస్య పరిష్కారమైన తర్వాత వినియోగదారుడికి ఐవీఆర్‌ఎస్ కాల్ వస్తుంది. వినియోగదారుడు సంతృప్తి చెందనట్లయితే కంప్లైంట్‌ను మళ్లీ రీఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరించడం, సమయాన్ని ఆదా చేయడం, పారదర్శకతను కాపాడటం చాట్‌బాట్ ప్రత్యేకత అన్నారు. వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ డీఈ నాగేశ్వరరావు