
పోరాటాలతోనే సంక్షేమ బోర్డు ఏర్పాటు
ములుగు రూరల్: పోరాటాల ఫలితంగానే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో పోలం కొండయ్య అధ్యక్షతన మంగళవారం ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులకు వివాహాలకు, డెలివరీకి, నార్మల్, ప్రమాద మరణాలకు పరిహారం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి నర్సయ్య, రాజేందర్, దేవేందర్, కొమరయ్య, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
కాటమయ్య కిట్లపై గీతకార్మికులకు శిక్షణ
ములుగు రూరల్: మండల పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో గీత కార్మికులకు కాటమయ్య కిట్లపై శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ క్రమంలో జంగాలపల్లి, ఇంచర్ల, లక్ష్మిదేవిపేట, గుర్రేవుల, కన్నాయిగూడెం గ్రామాలకు చెందిన గీత కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎకై ్సజ్ సీఐ సుధీర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతీ గీతకార్మికుడికి కాటమయ్య కిట్లను ఉచితంగా అందిస్తుందన్నారు. గీత కార్మికులు అందరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గౌడసంఘం నాయకులు ముంజాల భిక్షపతి మాట్లడుతూ జంగాలపల్లి క్రాస్ వద్ద సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన రవి, బుర్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సభ్యులకు అవార్డులు
ములుగు: హైదరాబాద్‌లో నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ ఎండి 320 మల్టీపుల్ 2024–25 అవార్డుల ప్రదానోత్సవంలో ములుగు లయన్స్ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఐపీడీజీ చైర్మన్ లయన్ బాపురావు మంగళవారం అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ నుంచి చంచు రమేష్, సానికొమ్ము రవీందర్‌రెడ్డిలు పాల్గొని జ్ఞాపికను అందుకున్నారు.

పోరాటాలతోనే సంక్షేమ బోర్డు ఏర్పాటు

పోరాటాలతోనే సంక్షేమ బోర్డు ఏర్పాటు