
కాళోజీ సేవలు మరువలేనివి
● అదనపు కలెక్టర్ సంపత్‌రావు
ములుగు రూరల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ కాళోజీ నారాయణరావు తెలుగు సాహిత్యం, ప్రజా ఉద్యమాల్లో చేసిన కృషి విశేషమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజ్‌కుమార్, సూపరింటెండెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో..
ములుగు: అదే విధంగా ములుగు మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గోవిందరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మమత, అధికారులు లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

కాళోజీ సేవలు మరువలేనివి