
పంట నష్టపరిహార మహిళా సాధన కమిటీ ఎన్నిక
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర పంట నష్ట పరిహార మహిళ సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ కమిటీ గౌరవ అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం మేడారంలో కమిటీ అధ్యక్షుడు కృష్ణాఅర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మహిళ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా జాలిగాపు సరోజన, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల బతుకమ్మ, ఉపాధ్యక్షులుగా నాలి ప్రతిభ, దానుక దేవమ్మ, చింత సునీత, గడ్డం సంధ్యారాణి, కార్యదర్శులుగా బోడ స్వరూప, జంగ వసుమతి, ఈక సుగుణ, ప్రచార కార్యదర్శులుగా దేవులపల్లి భద్రమ్మ, బానూరి రజిత, అల్లెం సరోజన, రాధమ్మలను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. మండల పరిధిలోని కొత్తూరులో 12న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రైతులు, కుల సంఘాలు, రాజకీయ నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు బాబురావు, గడ్డం అరుణ, నాయకులు సిద్ధబోయిన శివరాజ్, జంగా హన్మంతరెడ్డి, సోలం వెంకన్న సతీష్, సంకె ప్రణయ్ పాల్గొన్నారు.