
ఉత్తమ ఎస్సైగా శ్రీకాంత్‌రెడ్డి
ఎస్‌ఎస్‌తాడ్వాయి : తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్‌రెడ్డి జిల్లా ఉత్తమ ఎస్సైగా నిలిచి ఎస్పీ డాక్టర్ శబరీశ్ చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శబరీశ్, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డికి ప్రశంసపత్రం అందజేశారు. కేసుల విచారణ, అక్రమ పశువుల రవాణా, గుడుంబా కేసుల నమోదు, ఓవర్ లోడ్ లారీపై కేసులు, డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ ఉల్లంఘన, పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీ, సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలను నివారణ, గంజాయి నివారణ కోసం గ్రామాల్లో అవగాహన కార్యమ్రాలను నిర్వహించడంతో జిల్లా ఉత్తమ ఎస్సైగా మూడో సారి ప్రశంసపత్రం అందుకున్నారు. ఎస్పీ శబరీశ్, డీఎస్పీ రవీందర్‌లకు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కృత్ఞతలు తెలిపారు.