
రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభిస్తాం..
వెంకటాపురం(కె) : మండలకేంద్రం నుంచి ఎదిర గ్రామపంచాయతీ వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభిస్తామని ఆశాఖ ఎస్‌ఈ రాఘవరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలో ఆయన పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వీరభద్రవరం, బోదాపురం వంతెనలను పరిశీలించామని చెప్పారు. కుక్కతోగు వంతెనను పూర్తిస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. 40ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనలను తనిఖీ చేస్తామని, ఆర్‌అండ్‌బీ రోడ్లు గుంతలమయంగా మారిందని మరమ్మతుల కోసం రూ.2కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెండర్ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటాపురం పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహనరావు ఎస్‌ఈని కలిసి మండలంలో రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట ఈఈ సాంసింగ్, డీఈ వెంకటరమణ తదితరులు ఉన్నారు.
ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాఘవరెడ్డి