సరికొత్తగా... | Sakshi
Sakshi News home page

సరికొత్తగా...

Published Tue, Dec 19 2023 12:09 AM

WHAT THE FISH Movie First Look Unveiled - Sakshi

నిహారిక కొణిదెల లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘వాట్‌ ది ఫిష్‌’. ‘వెన్  ది క్రేజీ బికమ్స్‌ క్రేజియర్‌’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంతో వరుణ్‌ కోరుకొండ దర్శకునిగా పరిచయమవుతున్నారు. 6 ఐఎక్స్‌ సినిమాస్‌పై విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘ఈ సినిమాలో అష్టలక్ష్మిపాత్రలో కనిపిస్తారు నిహారిక.

ఆమెపాత్ర సరికొత్తగా, ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్, సహ నిర్మాత: వరుణ్‌ కోరుకొండ. కాగా 2019లో వచ్చిన ‘సూర్యకాంతం’ చిత్రం తర్వాత మళ్లీ నిహారిక నటిస్తున్న సినిమా ‘వాట్‌ ది ఫిష్‌’ కావడం విశేషం.

Advertisement
 
Advertisement