వితికా ఇంట వెల్లివిరిసిన ఆనందం.. త్వరలో బుజ్జి పాపాయి | Varun Sandesh–Vithika Sheru Celebrate Family Joy as Vithika’s Sister Krithika Announces Pregnancy | Sakshi
Sakshi News home page

Vithika Sheru: అక్క కంటే ముందే గుడ్‌న్యూస్‌ చెప్పిన చెల్లి

Sep 24 2025 2:45 PM | Updated on Sep 24 2025 3:28 PM

Vithika Sheru Sister Krithika Sheru Shares Good News

టాలీవుడ్‌ జంట వరుణ్‌ సందేశ్‌- వితికా షెరు (Vithika Sheru) ఇటీవలే కొత్తింట్లోకి గృహప్రవేశం చేశారు. ఇంతలోనే వితికా మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. తన చెల్లెలు కృతిక గర్భం దాల్చిందంటూ సదరు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. అందులో కృతిక బేబీ బంప్‌తో ఫోటోలకు పోజిచ్చింది. 

చెల్లి పెళ్లి
కృతిక - కృష్ణల వివాహం 2022లో జరిగింది. చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగా జరిపించింది వితికా. పెళ్లయిన మూడేళ్లకు కృతిక తల్లి కాబోతుండటంతో వీరి ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. చెల్లి తల్లి కాబోతోంది, మరి అక్క ఎప్పుడు గుడ్‌న్యూస్‌ చెప్తుందో? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

వరుణ్‌- వితిక జర్నీ
'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో వితిక- వరుణ్‌ జంటగా నటించారు. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. 2018లో వితిక తొలిసారి గర్భం దాల్చింది. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. కొద్దిరోజులకే గర్భస్రావం అయింది. ఈ సంఘటన తర్వాత వరుణ్‌తో బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చింది. దేవుడు కరుణించి పిల్లల్ని ఇస్తే అంతకంటే అదృష్టం ఇంకేముందని ఓసారి ఇంటర్వ్యూలో చెప్పింది.

 

 

చదవండి: కాంతార చూడాలంటే మందు, ముక్క జోలికి వెళ్లకూడదంటూ పోస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement