అందుకే అమీర్‌ సినిమా చేయలేకపోయా: విజయ్‌

Vijay Sethupathi Reveals Reason About Why He Quits Laal Singh Chaddha - Sakshi

విజయ్‌ సేతుపతి దక్షిణాదిన సూపర్‌ క్రేజ్‌ ఉన్న నటుడు. సినిమాలో ఆయన ఉన్నాడంటే ప్రేక్షకుడు ఒక్క క్షణం ఆలోచించకుండా డేటు రాసిపెట్టుకుని టంచనుగా ఫస్ట్‌ షోకు థియేటర్‌కు వెళ్తాడు. అంతటి 'ఉప్పెన'లాంటి ఫాలోయింగ్‌ ఆయన సొంతం. ఆ మధ్య విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపించాయి. లాల్‌సింగ్‌ చద్దా సినిమా ద్వారా అక్కడ రంగ ప్రవేశం చేయనున్నట్లు టాక్‌ వినిపించింది.

కానీ అతడి బరువుకు పాత్ర సెట్టవ్వదేమోనని, అందువల్ల ఆ సినిమా విజయ్‌ చేతి నుంచి చేజారిందని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఆ రూమర్లపై స్పందించాడు విజయ్‌ సేతుపతి. "అమీర్‌ ఖాన్‌ సర్‌ వ్యక్తిగతంగా నాకు లాల్‌సింగ్‌ చద్దా పాత్రను ఆఫర్‌ చేశారు. నేను షూటింగ్‌లో ఉన్న తమిళనాడుకు వచ్చి మరీ స్క్రిప్ట్‌ వినిపించారు. అద్భుతంగా కథను వివరించి చెప్పారు. వెంటనే ఓకే చెప్పాను. ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారిన తర్వాత ఆయన తిరిగి వెళ్లిపోయాడు.

అయితే కొన్ని కారణాల వల్ల దర్శకుడు అద్వైత్‌ చందన్‌ మాత్రం రాలేకపోయారు. అప్పుడు ఓకే చెప్పాను కానీ కోవిడ్‌ వల్ల నేను అంగీకరించిన షూటింగ్స్‌ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో చాలా పని పెండింగ్‌లో ఉండిపోయింది. లాక్‌డౌన్‌ తర్వాత ఐదు తెలుగు సినిమా ప్రాజెక్టుల్లో నేను పనిచేయాల్సి వచ్చింది. ఈ బిజీ షెడ్యూల్‌ వల్లే లాల్‌సింగ్‌ చద్దా నుంచి తప్పుకున్నాను" అని క్లారిటీ ఇచ్చాడు. అయితే మళ్లీ ఛాన్స్‌ దొరికితే తప్పకుండా అమీర్‌ ఖాన్‌తో కలిసి నటిస్తానంటున్నాడు.

చదవండి: ఉప్పెన: విజయ్‌ సేతుపతి అందుకే డబ్బింగ్‌ చెప్పలేదు..

‘ఉప్పెన’ మూవీ రివ్యూ

ప్రియుడితో నటి రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top