
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపాయి. ఓ యువతిని విజయ్ చాలా ఏళ్లుగా ఇబ్బంది పెట్టాడని, క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలు ఆఫర్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు సదరు యువతి ప్రస్తుతం రిహబిలేషన్ సెంటర్ చికిత్స పొందుతోందని సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించి.. కాసేపటికే ఆ పోస్ట్‌ని డిలీట్ చేసింది.
అసలేం జరిగింది?
కోలీవుడ్‌లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి నిన్న(జులై 28) మధ్యాహ్నం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఆరోపించింది.
‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్‌లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది.

అంతేకాదు నిజాన్ని గుర్తించకుండా.. బాధితురాలిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. డైరీ, ఫోన్ చాట్‌ల ద్వారా ఆ యువతి అనుభవించిన బాధ బయటకు వచ్చిందని, ఇది కట్టు కథకాదని, ఆమె జీవితం..ఆమె బాధ..అంటూ మరో ట్వీట్ చేసింది.
అందుకే డిలీట్ చేశా
విజయ్‌ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. నిజమే అయితే ఎందుకు డిలీట్ చేశావంటూ నెటిజన్స్ రమ్యపై మండిపడ్డారు. దీంతో దానికి వివరణ ఇస్తూ రమ్య మరో ట్వీట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్‌ను తొలగించినట్లు ఆ ట్వీట్‌లో పేర్కొంది.
I shared that tweet out of frustration and to vent. Didn’t expect it to get this much attention. Getting too many enquiries about it now. Out of concern for her privacy and wellbeing I’ve decided to take it down. Hope that’s respected.
— Ramya Mohan (@_Ramya_mohan_) July 28, 2025