Vijay Deverakonda: లైగర్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌, రౌడీ ఫోటో వైరల్‌ | Vijay Deverakonda Resumes Liger Shoot New Photo Out | Sakshi
Sakshi News home page

Liger Movie: అంచనాలు పెంచుతున్న ‘రౌడీ’ విజయ్‌ లుక్‌

Sep 15 2021 3:59 PM | Updated on Sep 15 2021 6:27 PM

Vijay Deverakonda Resumes Liger Shoot New Photo Out - Sakshi

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక.  పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ సినిమాలో ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. 

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. బుధవారం కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైందని చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ ఫొటోని విడుదల చేసింది. ఇందులో విజయ్‌ జుత్తుతో షర్ట్‌లేకుండా బాక్సింగ్‌ రింగ్‌లో కూర్చొని ఉన్నాడు. ఇది ఫైట్‌ సీన్‌కు సంబంధించినదిగా ఫోటో అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇక వైరల్ అవుతోంది. రక్తం.. చెమట.. హింస’ అంటూ ఈ ఫొటోకి విజయ్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement