
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ చిత్రంలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించగా సత్యదేవ్ కీలకపాత్రలో నటించారు. సత్యదేవ్, విజయ్‌దే వరకొండ అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ‘కింగ్‌డమ్’ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. కాగా... ఈ సినిమాకు హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు.