
విజయ్ ఆంటోని హీరోగా నటించిన ΄పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘భద్రకాళి’. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్–మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు.
ఈ సినిమాని సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సెప్టెంబరు 19న విడుదల చేయనున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్ మెంట్‌తో కలిసి రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం: విజయ్ ఆంటోని.