ఓ కల ఆధారంగా.. 

Vidhi Releasing on November 3rd - Sakshi

రోహిత్‌ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్‌ రంగనాథన్, శ్రీనాథ్‌ రంగనాథన్‌ ద్వయం దర్శకత్వం వహించిన చిత్రం ‘విధి’. ఎస్‌. రంజిత్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రోహిత్‌ నందా మాట్లాడుతూ ‘‘న్యూజిల్యాండ్‌లో చదువుకున్నాను. నటనపై ఆసక్తితో స్టేజ్‌ డ్రామాల్లో చేశాను. చిరంజీవిగారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాను.

ఇక ‘విధి’ సినిమా రా అండ్‌ రస్టిక్‌ ఫిల్మ్‌. రియల్‌ లైఫ్‌లోని నా క్యారెక్టర్‌కు విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేశాను. అలాగే మా ‘విధి’ సినిమాను చూపులేనివారు కూడా ఓ యాప్‌ సాయంతో ఆస్వాదించవచ్చు. ఈ ఆలోచన నాదే. కొన్ని కొత్త కథలు వింటున్నాను’’ అన్నారు. ‘‘మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి వచ్చిన ఓ కల ఆధారంగా ‘విధి’ సినిమా స్టోరీ లైన్‌ను డెవలప్‌ చేసి, కథ రెడీ చేసుకున్నాం. రోహిత్‌ బాగా చేశారు’’ అన్నారు శ్రీనాథ్, శ్రీకాంత్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top