కమల్‌గారు గ్లోబల్‌ స్టార్‌: విక్టరీ వెంకటేశ్‌

Venkatesh Hails Kamal Haasan As Global Star - Sakshi

‘‘దక్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్‌హాసన్‌గారికి ముందు.. మరొకటి కమల్‌గారు వచ్చిన తర్వాత. ఆయనతో ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయాలని ఉంది. కమల్‌గారు నాకు అపూర్వ సహోదరులు’’ అని అన్నారు హీరో వెంకటేశ్‌. కమల్‌హాసన్, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘విక్రమ్‌’. ఈ సినిమాను తెలుగులో ‘విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌’ పేరుతో హీరో నితిన్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 3న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా జరిగిన ‘విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్‌ మాట్లాడుతూ – ‘‘కమల్‌గారి ‘పదినారు వయదినిలే’ (పదహారేళ్ల వయసు) చూసిన తర్వాత నేను క్లీన్‌»ౌల్డ్‌. ఆయన నటించిన ‘మరో చరిత్ర’ ప్రతి యాక్టర్‌కు జీపీఎస్‌. ‘దశావతారం’లాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్‌కు ధైర్యం సరిపోదు. ‘ఏక్‌ దూజే కేలియే’తో ఆయన ఫస్ట్‌ పాన్‌ ఇండియా స్టార్‌. ఈ రోజు కమల్‌గారు గ్లోబల్‌ స్టార్‌. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి.

‘విక్రమ్‌’ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్న సుధాకర్, నితిన్‌లకు కంగ్రాట్స్‌’’ అన్నారు. కమల్‌హాసన్‌ మాట్లాడుతూ – ‘‘దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్‌గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా హైదరాబాద్‌ వచ్చాను. అప్పట్నుంచి నేను తెలుగు ఫుడ్‌ తింటున్నాను. నా కెరీర్‌లో ఎన్నో హిట్స్‌ను తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. డైరెక్టర్‌ బాలచందర్‌గారితో నేను 36 సినిమాలు చేశాను. అదే నా పీహెచ్‌డీ. నా స్టైల్, రజనీకాంత్‌ స్టైల్‌ ఆయన్నుంచే వచ్చాయి.  వెంకీగారు ఓసారి గోవాకు వస్తే, ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వచ్చారా? అన్నాను. మిమ్మల్ని చూడటానికి వచ్చానన్నారు. నాకు తెలిసింది చెప్పాను. ఆయనకు మరో వేవ్‌ వచి్చంది.

ఇప్పుడు నా బ్రదర్‌ ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను, వెంకీగారు ‘మర్మయోగి’ సినిమా చేయాల్సింది. చేసి ఉంటే మా కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచి ఉండేది. ‘విక్రమ్‌’ సినిమాకు మంచి టీమ్‌ కుదిరింది. ఈ సినిమా హిట్‌ మీ (ప్రేక్షకులు) చేతుల్లోనే ఉంది. డైరెక్టర్‌ లోకేశ్‌గారు నాలాగే (బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా) ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలాంటివారిని నేను మరింత గౌరవిస్తాను. ఇండియన్‌ ఫిల్మ్స్‌... పాన్‌ ఇండియా చాలదు.. పాన్‌ వరల్డ్‌. అది మీ (ప్రేక్షకులు) సహకారం లేకుండా జరగదు. మంచి సినిమాలు ఇవ్వండని మీరు డిమాండ్‌ చేయాలి. ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నేను మంచి సినిమాకు అభిమానిని’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కమల్‌గారి అద్భుతమైన యాక్షన్‌ను చూస్తారు’’ అన్నారు లోకేశ్‌ కనగరాజ్‌. ‘‘కమల్‌హాసన్‌గారు ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’’ అన్నారు నితిన్‌. ‘‘తెలుగులో ‘విక్రమ్‌’ను రిలీజ్‌ చేసే చాన్స్‌ ఇచి్చన కమల్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు సుధాకర్‌ రెడ్డి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top