వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ ఇదే

వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ మూవీ సినిమా టైటిల్‌తో మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ‘గని’అని టైటిల్ ఖరారు చేశారు. బాక్సింగ్ రింగ్ లో పంచ్‌లు కొడుతున్న వరుణ్ లుక్‌ని మోషన్ పోస్టర్‌లో చూపించారు.
(చదవండి : తేజ కొత్త సినిమా.. అలిమేలు ఆవిడే!)
ఈ చిత్రంలో హీరో పేరు గని అందుకే సినిమాకి కూడా అదే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ఈ పాత్రలో స్టార్ హీరో ఉపేంద్ర చేయనున్నాడు. వరుణ్ తేజ్ కి కోచ్ గా.. సునీల్ శెట్టి, ప్రతినాయకుడిగా జగపతిబాబు కనిపించనున్నాడు. అందాల రాక్షసి ఫేమ్… నవీన్ చంద్రకు కీలకమైన పాత్ర దక్కింది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి