
కొన్ని సంఘటనలు మనసును పట్టి కుదిపేస్తాయి. రోజులు గడుస్తున్నా ఆ ఘటనల నుంచి కోలుకోలేం. రెండేళ్లక్రితం తన జీవితంలోనూ అలాంటి విషాద సంఘటన చోటు చేసుకుందంటున్నాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. చాలాకాలం నేను ఏదో భ్రమలో బతికాను. జీవితమంటే ఏంటనేది మా డ్రైవర్ చనిపోయినప్పుడే తెలిసొచ్చింది.
సీపీఆర్ చేసినా..
2022 జనవరి 18న నా కారు డ్రైవర్ మనోజ్ సాహు మరణించాడు. ఆరోజు అతడిని ఎలాగైనా బతికించుకోవాలని ప్రయత్నించాం. తనకు సీపీఆర్ కూడా చేశాను. ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. ఒక ప్రాణాన్ని కాపాడాలనుకున్నాం. కానీ ఆస్పత్రికి వెళ్తే అప్పటికే అతడి ఊపిరి ఆగిపోయిందన్నారు. నా చేతుల్లోనే అతడు మరణించాడు. ఈ సంఘటన నన్ను ఎంతో డిస్టర్బ్ చేసింది.
మునుపటిలా లేను
అలా అని అక్కడే ఆగిపోలేం కదా.. జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. ఈ ఘటనకు ముందు వరుణ్ వేరు, ఇప్పుడున్న వరుణ్ వేరు. నా మెదడులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉండేవి. అప్పటినుంచి భగవద్గీత, మహాభారతం చదవడం ప్రారంభించాను అని చెప్పుకొచ్చాడు. కాగా వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన