ఓటీటీలో మలయాళ హిట్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌ | Varshangalkku Shesham OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో మలయాళ హిట్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Published Thu, May 30 2024 8:14 AM

Varshangalkku Shesham OTT Streaming Date Locked

ఈ ఏడాదిలో  మలయాళ చిత్ర పరిశ్రమ చాలా హిట్‌ సినిమాలతో కళకళలాడిపోతోంది. ఈ ఏడాదిలో వచ్చిన చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. చాలా సినిమాలు అక్కడి ప్రేక్షకులతో పాటు.. ఇతర భాషల సినీ ప్రేమికులనూ అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేమలు,మంజుమ్మెల్‌ బాయ్స్‌, భ్రమయుగం,ఆవేశం,ఆడుజీవితం ,అన్వేషిప్పిమ్‌ కండెతుమ్‌ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇవన్నీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.

అయితే తాజాగా మరో హిట్‌ సినిమా తెలుగులో విడుదల కానుంది. అది కూడా ఓటీటీలోకి రానుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్ నటించిన చిత్రం 'వర్షంగల్కు శేషం'. ఏప్రిల్ 11వ తేదీన రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ దక్కించుకుంది. సుమారు రెండేళ్ల క్రితం ప్రణవ్ మోహన్‍లాల్‌కు మొదటి హిట్ అందించిన డైరెక్టర్‌ వినీత్ శ్రీనివాసన్ ఈ చిత్రం ద్వారా మరో విజయాన్ని అందుకున్నారు. జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ వేదికగా 'వర్షంగల్కు శేషం' స్ట్రీమింగ్‌ కానుంది.  ఈమేరకు తెలుగు ట్రైలర్‌ను కూడా సోని లివ్‌ విడుదల చేసింది.

మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో విడుదల అవుతుందని అధికారికంగా మేకర్స్‌ ప్రకటించారు. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 80 కోట్లకు పైగానే కలెక్ట్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. 'వర్షంగల్కు శేషం' కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రధానంగా ఇద్దరు స్నేహితుల చుట్టూ జరిగే సంఘటనలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి.  వారిలో ఒకరు   డైరెక్టర్ కావాలని ప్రయత్నిస్తే.. మరొకరు సంగీత దర్శకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా ఈ చిత్రం దగ్గరైంది. జూన్‌ 7 నుంచి సోనీ లివ్‌లో తెలుగులో అందుబాటులోకి రానున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో పాటు  చూసి ఎంజాయ్‌ చేయండి.

Advertisement
 
Advertisement
 
Advertisement