కోర్టు రూమ్ డ్రామాతో 'వంచన' | Vanchana Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

కోర్టు రూమ్ డ్రామాతో 'వంచన'

Oct 26 2024 1:11 PM | Updated on Oct 26 2024 4:04 PM

Vanchana Movie Release Date Locked

చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఉమా మహేష్ ప్రధాన పాత్రలో సూర్య, రాజేంద్ర,  ఆర్ కె నాయుడు, సోనీ రెడ్డి ముఖ్య తారాగణంతో ఒక సినిమా రానుంది. ఉమా మహేష్ మార్పు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గౌరీ మార్పు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు 'వంచన' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. అయితే ఈ రోజు ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ చిత్రం నవంబర్ 8న విడుదల.

ఈ సందర్భంగా దర్శకుడు ఉమా మహేష్ మార్పు మాట్లాడుతూ.. 'వంచన' ఒక కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామా చిత్రం. అరకు ఊరిలో ఒక క్రిస్టియన్ ఫాదర్‌ని అతి కిరాతకంగా హత్య చేస్తారు. మంచి స్క్రీన్ ప్లేతో అద్భుతమైన ట్విస్టులతో హత్య ఎవరు, ఎందుకు చేస్తారో తెలిపే కోర్టు రూమ్ డ్రామా కథే మా 'వంచన' సినిమా. మా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని చూసి సున్నితమైన కథని చాలా గొప్పగా చిత్రీకరించారని అభినందించారు. 

ఇటీవలే మా చిత్ర టీజర్‌ను విడుదల చేశాము. మంచి రెస్పాన్స్ వచ్చింది.  థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 2న విడుదల చేస్తున్నాము. సినిమా చాలా కొత్తగా, మంచి థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుంది. అరకు, ఢిల్లీ, మనాలి, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం, జైపూర్ లాంటి  అందమైన లొకేషన్స్ లో మా చిత్రాన్ని రెడ్ డ్రాగన్ సినీ లైన్ కెమెరా తో చిత్రీకరించాం. మా సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. నవంబర్ 8న విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాము' అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement