
దీపావళి పండుగ సెలబ్రిటీలకు చాలా ఇష్టమైన పండుగ అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా జరుపుకోవడం మాత్రమే కాదు బిజీ జీవితంలో అరుదుగా మాత్రమే కలవగలుగుతున్న సన్నిహితులకు, పరిచయస్థులకు దీపావళి బాష్ పేరిట పార్టీలు ఇవ్వడానికి కూడా ఇదే చక్కని సందర్భంగా స్టార్స్ భావిస్తారు. దాంతో ఈ సమయంలో దీపావళి పార్టీలు జోరుగా సాగుతాయి. మన టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్‌లో ఇవి ఒక సంప్రదాయంగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో ముంబైలో ఝాన్సీరెడ్డి అనే సన్నిహితులు ఇచ్చిన ఈ పార్టీకి పలువురు బంధుమిత్రులతో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి ఆమె సోదరి శిల్పా శిరోడ్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పార్టీలో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పార్టీలో మహేష్, నమ్రతల కుమార్తె తాజా యాడ్ వరల్డ్ యంగెస్ట్ సెన్సేషన్ సితార కూడా పాల్గొంది.
ఈ సందర్భంగా నమ్రత తమ ఘట్టమనేని అభిమానులతో తన దీపావళి వేడుకల విశేషాలను పంచుకున్నారు. తన కుమార్తె సితార ఘట్టమనేని సోదరి శిల్పా శిరోద్కర్‌తో తాము కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఆ ఛాయా చిత్రాలను పంచుకుంటూ, నమ్రత ‘వెచ్చదనం, వెలుగులు అద్భుతమైన వ్యక్తులతో నిండిన సాయంత్రం... నిజంగా మరపురాని దీపావళి రాత్రులు... మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు‘ అంటూ క్యాప్షన్‌లో రాశారు. ఈ ఫొటోలో హైదరాబాద్ నగర ప్రముఖులు పింకీ రెడ్డి వంటివారు కూడా నమ్రత బృందంలో కనిపించారు.
అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ అభిమాన కధానాయకుడు లేకుండా ఆయన భార్య వేడుకలు జరుపుకుంటే.. అడగకుండా ఉంటారా? అందుకే ఆ ఫొటోల కింద కామెంట్లు వెల్లువెత్తాయి. మహేష్ బాబు ఎక్కడ అంటూ పలువురు ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపించారు. ఒకరు, ‘మన సూపర్ స్టార్ ఎక్కడ?‘ అని ఆరా తీయగా మరికొందరు, ‘బాబు ఎక్కడ‘ అనీ అడిగారు. నమ్రతను తన కుమార్తెతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలను షేర్ చేయమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభ్యర్ధించారు. మరోవైపు రాజమౌళి తీస్తున్న సినిమా షూటింగ్‌లో మహేష్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.