ది గోట్‌ లైఫ్‌ను దాటేేసిన చిన్న సినిమా.. ఏకంగా టాప్-6లో..! | Vaazha 2 enters top 6 Malayalam Hits with over Rs 150 crore haul | Sakshi
Sakshi News home page

Vaazha 2 Movie: పది రోజుల్లోనే ది గోట్‌ లైఫ్‌ రికార్డ్ బ్రేక్..!

Apr 13 2026 6:22 PM | Updated on Apr 13 2026 6:36 PM

Vaazha 2 enters top 6 Malayalam Hits with over Rs 150 crore haul

ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్‌-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్‌ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్‌తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది. 2024లో వచ్చిన ది గోట్ లైఫ్‌ రూ. 158.50 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. కేరళ బయట సైతం ఈ మూవీకి క్రేజ్ వస్తోంది. పాఠశాల జీవితం, ఫ్రెండ్స్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా చూస్తే వసూళ్లపరంగా రూ. 89.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్‌సీస్‌ మార్కెట్‌లో రూ. 73.75 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఇండియాలో రూ. 77.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.

హిట్‌ మూవీకి సీక్వెల్‌.. 

2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బ్రోస్‌' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్‌ దాస్‌ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్‌ డైరెక్ట్‌ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement