Vaazha : Biopic of a Billion Boys
-
18 రోజుల్లో రూ. 205 కోట్ల కలెక్షన్స్.. మలయాళ మూవీ సంచలనం!
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు మాత్రమే కాదు నూతన నటీనటుల మూవీస్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే నిర్మాతలు కూడా పాన్ ఇండియా ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. కేవలం ఒక భాషలోనే కాకుండా..ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. మన తెలుగు నిర్మాతలు..మలయాళ, కన్నడ సినిమాలు చేసి అక్కడ విజయాలు అందుకుంటున్నారు. అలా తెలుగు నిర్మాత సాహు గారపాటి రూ.10 కోట్లతో నిర్మించిన మలయాళ సినిమా ఒకటి అక్కడి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. కేవలం 18 రోజుల్లోనే రూ. 205 కోట్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. అదే ‘వాళా 2’. 2024లో వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వాళా’ చిత్రానికి కొనసాగింపు ఇది. కొత్త నటీనటులతో సావిన్ ఎస్ఏ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విపిన్ దాస్ తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 2 మలయాళంలో విడుదలై.. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా 18 రోజుల్లోనే రూ. 205 కోట్ల వసూళ్లను రాబట్టి.. మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రూ.300+ కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ‘ఎల్2: ఎంపురాన్’, ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘తుడరుమ్’ చిత్రాలు ఉన్నాయి. వాళా 2 చిత్రాన్ని ఏప్రిల్ 24న తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. మరి ఇక్కడ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. -
మలయాళ బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ రిలీజ్
మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ ఇప్పటికే ది గోట్ లైఫ్ ఆల్ టైమ్ వసూళ్లు అధిగమించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-6 ప్లేస్‌లో నిలిచింది. ఏప్రిల్ 2న రిలీజైన ఈ సినిమా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి కూడా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నట్లు షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ఏప్రిల్ 24న తెలుగులో విడుదల కానుందని వాళా-2 పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.వాళాకు సీక్వెల్..2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు విపిన్ దాస్ కథ అందించారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థమట. ఏ పని లేకుండా సోమరిగా తిరిగేవాళ్లను ఇదే పేరుతో పిలుస్తారట. The laughter, the chaos, the brotherhood… now in Telugu.After emerging as the biggest Malayalam blockbuster of 2026, #Vaazha2 is all set to arrive for the Telugu audience on April 24th ❤️🔥Get ready to experience this sensational blockbuster on the big screens 🎬… pic.twitter.com/NpJ0R4gfMC— Shine Screens (@Shine_Screens) April 15, 2026 -
ది గోట్ లైఫ్‌ను దాటేేసిన చిన్న సినిమా.. ఏకంగా టాప్-6లో..!
ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్‌తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది. 2024లో వచ్చిన ది గోట్ లైఫ్ రూ. 158.50 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. కేరళ బయట సైతం ఈ మూవీకి క్రేజ్ వస్తోంది. పాఠశాల జీవితం, ఫ్రెండ్స్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా చూస్తే వసూళ్లపరంగా రూ. 89.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో రూ. 73.75 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఇండియాలో రూ. 77.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.హిట్ మూవీకి సీక్వెల్.. 2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. -
పిల్లలకో పాఠం.. పెద్దలకో గుణపాఠం
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం వాళ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.‘వాళ’ తప్పనిసరిగా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడవలసిన సినిమా. మనిషి జీవితంలో యవ్వన దశకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు మాత్రం బళ్లో, ఊళ్లో సరదాగా స్నేహితులతో గడిచిపోయే స్థితి అది. కానీ తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల యవ్వన దశ అనేది కత్తి మీద సాములాంటిదే. పిల్లల భవిష్యత్తు పై ఆశతో అతి గారాబంగా తమ పిల్లలను చూసుకునేవారు కొందరైతే, తమ పిల్లలు దేనికీ పనికి రారని మరికొందరు వారి యవ్వన దశను వారికి అనుగుణంగా అనుభవించనీయకుండా చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికే ఈ ‘వాళ’ సినిమా. ‘బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్’ అన్నది దీని ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమాకి సరిగ్గా సరిపోవడమే కాదు, నిజ జీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికీ రిలేట్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్. ప్రముఖ నటుడు బసిల్ జోసెఫ్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... తమ కెరీర్ పరంగా ఓడిపోయిన నలుగురు స్నేహితుల కథ ఇది. ఈ నలుగురూ తమ స్కూల్ నుండి కాలేజ్ వరకు చేసే ప్రయాణం చూసే ప్రతి ప్రేక్షకుడి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది. ఈ నలుగురూ స్కూల్, కాలేజ్ అన్నింటిలోనూ ఫెయిలవుతారు. కానీ ఆ ఫెయిలైన వాళ్లు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖర్లో చక్కటి సందేశమిస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అవుతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాకుండా తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారన్నది మాత్రం ఈ సినిమాలోనే చూడాలి. తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు తమ పిల్లలు వాళ్ల కెరీర్‌ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్లకే వదిలేయాలి కానీ తమ ఆలోచనలను వాళ్ల మీద రుద్దకూడదన్న అంశం మీద తీసిన ఈ సినిమా నిజంగా అభినందనీయం. తీసుకున్న పాయింట్ సీరియస్‌దే అయినా సినిమా మొత్తాన్ని చక్కటి స్క్రీన్‌ప్లేతో మంచి కామెడీని మేళవించి కుటుంబమంతా కలిసి చూసే విధంగా రూపొందించారు దర్శకుడు. మనం వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం. కానీ కొన్ని సినిమాలు మనకు మార్గదర్శకమవుతాయి. అటువంటి సినిమానే ఈ ‘వాళ... బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్’... మస్ట్ వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
Vaazha Review : పిల్లలకో పాఠం.. పెద్దలకో గుణపాఠం
ఈ సినిమా తప్పనిసరిగా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడవలసిన సినిమా. మనిషి జీవితంలో యవ్వన దశకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు మాత్రం బళ్ళో, ఊళ్ళో సరదాగా స్నేహితులతో గడిచిపోయే స్థితి అది. కాని తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల యవ్వన దశ అనేది కత్తి మీద సాములాంటిదే. పిల్లల భవిష్యత్తు పై ఆశతో అతి గారాబంగా తమ పిల్లలను చూసుకునే వారు కొందరైతే, తమ పిల్లలు దేనికీ పనికిరారని మరికొందరు వారి యవ్వన దశను వారిగనుణంగా అనుభవించనీయకుండా చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికే ఈ సినిమా వాఝా(Vaazha : Biopic of a Billion Boys). బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అన్నది దీని టాగ్ లైన్.ఈ టాగ్ లైన్ సినిమాకి సరిగ్గా సరిపోవడమే కాదు, నిజజీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికీ రిలేట్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్. ప్రముఖ నటుడు బసిల్ జోసెఫ్(Basil Joseph) ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే తమ కెరీర్ పరంగా నలుగురు ఓడిపోయిన స్నేహితుల కథ ఇది. ఈ నలుగురు తమ స్కూల్ నుండి కాలేజ్ వరకు చేసే ప్రయాణం చూసే ప్రతి ప్రేక్షకుడి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది.ఈ నలుగురు స్కూలు, కాలేజ్ అన్నింటిలోనూ ఫెయిలవుతారు. కాని ఆ ఫెయిలయిన వాళ్ళు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖర్లో చక్కటి సందేశమిస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అవుతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాక తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారన్నది మాత్రం మీరు ఈ సినిమాలోనే చూడాలి. తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు తమ పిల్లలు వాళ్ళ కెరీర్ ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్ళకే వదిలేయాలి కాని తమ ఆలోచనలను వాళ్ళ మీద రుద్ద కూడదన్న అంశం మీద తీసిన ఈ సినిమా నిజంగా అభినందనీయం. సినిమాలో తీసుకున్న పాయింట్ సీరియస్ దే అయినా సినిమా మొత్తాన్ని చక్కటి స్క్రీన్ ప్లే తో మంచి కామెడీని మేళవించి కుటుంబమంతా కలిసి చూసే విధంగా రూపొందించాడు దర్శకుడు. మనం వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం. కాని కొన్ని సినిమాలు మనకు మార్గదర్శకమవుతాయి. అటువంటి సినిమానే ఈ వాఝా... బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది. మస్ట్ వాచ్.


