జన్యుపరమైన కారణాలతో కిడ్నీ, లివర్ ఫెల్యూర్‌తో భాదపడుతున్న ప్రణీత్..
ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబం..
స్పందించి రూ.లక్ష అందించిన ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ వింధ్య విశాఖ..
దాతలు సహాకారం అందించాలని సోషల్ మీడియాలో విఙ్ఞప్తి..
కిడ్నీ, లివర్ ట్రాక్స్‌ప్లాంటేషన్‌కు 40 లక్షలు అవసరం..: తండ్రి స్వామి.
సాక్షి, సిటీబ్యూరో: ప్రాణానికి ప్రామాణికమైన కిడ్నీ, లివర్ పనిచేయకపోవండంతో.. ఆపన్నహాస్తం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద బాలుడికి ఆర్థిక సహాయమందించి తనమానవత్వాన్ని చాటుకుంది ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, టీవీ యాంకర్ వింధ్య విశాఖ. ఆ బాలుడు ప్రణీత్‌కు తాను అందించిన లక్ష రూపాయలు సరిపోవని, సోషల్ మీడియాలో సహాకారం అందించాలని కోరుతోంది. జన్యుపరమైన కారణాలతో కిడ్ని, లివర్ రెండూ పనిచేయకుండాపోయిన ప్రణీత్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అదే ఆసుపత్రిలో తన తండ్రి డయాలసిస్ కోసం తరచుగా వెళుతున్న వింధ్య విశాఖ తమ పక్క బెడ్ పైనే ఉన్న ప్రణీత్ పరిస్థితిని ఆరా తీసి తనవంతు సహాయం అందించింది. ఆరోగ్య శ్రీ వర్తించని బాలుడి కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స కోసం సహాకారం అందించాలని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో.. తనకు క్రికెట్ అంటే ఇష్టమని, తన ఫేరెట్ కోహ్లి, తన జెర్సి నెంబర్ 18 అంటూ సాగిన సంభాషన అందరినీ కలచి వేస్తోంది.

చికిత్స కోసం ఉన్న ఆస్తి అమ్మేశా..
మాది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని గిరిపల్లి గ్రామం. తోమ్మిదేళ్ల నా కొడుకును వారంలో 3 రోజులు డయాలసిస్ కోసం నగరంలోని హాస్పిటల్‌కు రావల్సివస్తుంది. అర్థ ఎకరం భూమి అమ్మి 20 లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించాను. ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చింది. కానీ ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు 40 లక్షల రూపాయలు ఖర్చవుతాయంట. నా ఇద్దరు కొడుకులు జెనికల్ డిసార్డర్‌తోనే పుట్టారు. దాతలు సహాయాన్ని నా 9849520535 నెంబర్‌కు ఫోన్‌పే, గూగుల్ పే చేయవచ్చు. -ఎంకమొల్ల స్వామి, ప్రణీత్ తండ్రి.
ప్రణీత్‌ను కాపాడుకుందాం..
డయాలసిస్ వల్ల బీపీ పెరిగిపోయి అవస్థలు పడుతున్న సమయంలో ప్రణీత్‌ని తన తండ్రి ఒడిలో పెట్టుకున్నప్పుడు మొదటి సారి చూశాను. సహాయంగా నావంతు లక్ష అందించాను, కానీ అది సరిపోదు. దయచేసి ఎవరికి తోచినంత వారు సహాయం చేయాలని కోరుతున్నాను. తనకు మంచి భవిష్యత్ ఉంది, చాలా యాక్టివ్‌గా, నేర్చుకోవాలనే తపనతో ఉంటాడు. ప్రణీత్‌ను గత 3 నెలలుగా గమనిస్తున్నాను. డబ్బులు సమకూరితే నిండు ప్రాణాన్ని కాపాడిన వారమౌతాము.
-వింధ్య విశాఖ, స్పోర్ట్స్ ప్రజెంటర్.


