అతన్ని పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కూడా కన్నాను : త్రిష పోస్ట్‌ వైరల్‌ | Trisha Responds on Retirement, Marriage Rumours | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నా.. పిల్లలు కూడా ఉన్నారు : త్రిష పోస్ట్‌ వైరల్‌

Apr 7 2026 1:31 PM | Updated on Apr 7 2026 2:52 PM

Trisha Responds on Retirement, Marriage Rumours

స్టార్‌ హీరోయిన్‌ త్రిష పేరు ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తోంది. కోలీవుడ్‌ స్టార్‌, టీవీకే అధినేత విజయ్‌ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్‌తో త్రిష రిలేషన్‌తో ఉన్నట్లు రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ ఫంక్షన్‌కి హాజరవ్వడంతో.. ఈ పుకార్లు ఇంకా ఎక్కువైయ్యాయి. త్వరలో పెళ్లి చేసుకుంటారని..ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి..రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ రకరకాల రూమర్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల  నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్‌ కూడా త్రిష ఇకపై నటించబోదని చెప్పడంతో మరోసారి త్రిషపై నెట్టింట చర్చ జరిగింది. 

దీనిపై త్రిష తనదైన శైలీలో స్పందించింది. చిత్రా లక్ష్మణ్‌ వాఖ్యలకు కౌంటర్‌గా ‘అవును నేను సినిమాలు మానేసి, ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని, నిన్నటికి రెండేళ్లు నిండిన నలుగురు కవలలను పెంచుతున్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? ఈ రోజు వార్తలు రాసుకోవడానికి ఇది సరిపోతుందా లేదా ఇంకా ఏదైనా జోడించమంటారా?’ అని త్రిష ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌తో ఆమె సినిమాలు మానేసిందనేది పుకారు మాత్రమేనని తేలిపోయింది. 

త్రిష సినీ కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం అమె ‘కరుప్పు’(తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించిన విశ్వంభర రిలీజ్‌కు రెడీ అవుతుంది. దేవిధంగా మలయాళంలో మోహన్‌లాల్‌ కు జంటగా రామ్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం.

 

Advertisement
 
Advertisement
Advertisement