IMDb: ఈ ఏడాది టాప్‌ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో 'ఆర్ఆర్ఆర్' | Top Ten Movies In Indian Most Popular Movies Of the Year 2022 | Sakshi
Sakshi News home page

IMDb: ఈ ఏడాది టాప్‌ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో 'ఆర్ఆర్ఆర్'

Dec 14 2022 3:38 PM | Updated on Dec 14 2022 5:35 PM

Top Ten Movies In Indian Most Popular Movies Of the Year 2022 - Sakshi

ఈ ఏడాది ఇండియాలో టాప్‌ టెన్‌ మూవీస్‍లో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబి ఈ జాబితాను విడుదల చేసింది. టాప్‌ 10 మోస్ట్ పాపులర్‌ ఇండియన్‌ మూవీస్‌ ఆఫ్‌ 2022’ పేరుతో విడుదల చేసిన జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యంత భారీ బడ్జెడ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. మొదటిస్థానంలో ఆర్ఆర్ఆర్, రెండోస్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, మూడోస్థానంలో కేజీఎఫ్-2, నాలుగో స్థానంలో విక్రమ్, ఐదో ప్లేస్‌లో కాంతార నిలిచింది.

ఆ తర్వాత వరుసగా రాకెట్రీ, మేజర్, సీతారామం, పొన్నియిన్ సెల్వన్, చార్లీ 777 చిత్రాలు టాప్‌ టెన్‌లో స్థానం దక్కించుకున్నాయి. ఈ ఏడాది భారీ బడ్జెట్‌ చిత్రాలతో పాటు.. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ హీరో రిషబ్ శెట్టి చిత్రం  కాంతార మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్‌ ఉంటే బ్రహ్మరథం పట్టారు. 

టాప్‌ 10 మోస్ట్‌ పాపులర్ ఇండియన్‌ మూవీస్‌- 2022

  •  ఆర్‌ఆర్‌ఆర్‌ 
  •  ది కశ్మీర్‌ ఫైల్స్‌ 
  • కేజీయఫ్‌-2
  •  విక్రమ్‌
  •  కాంతార
  • రాకెట్రీ
  • మేజర్‌
  •  సీతారామం
  •  పొన్నియిన్‌ సెల్వన్‌
  • 777 చార్లీ

Advertisement
 
Advertisement
Advertisement