ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ | Tollywood Producer Dil Raju Interesting Comments On Cinema | Sakshi
Sakshi News home page

Dil Raju: నాకు అది తప్ప ఏది చెప్పినా ఎక్కదు: దిల్‌ రాజు

May 23 2024 8:34 PM | Updated on May 23 2024 8:50 PM

Tollywood Producer Dil Raju Interesting Comments On Cinema

ఆశిష్‌, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్‌ మీ. ఇఫ్‌ యు డేర్‌ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు.  తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్‌ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్‌ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు ఎలాంటి బిజినెస్‌లు లేవని.. చనిపోయే వరకు సినిమాలే చేస్తానని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. 'మేము 25 ఏళ్లు కష్టపడితేనే వచ్చిన బ్రాండ్‌ ఇది. ఎస్వీసీ(శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌) కానీ, డీఆర్‌పీ(దిల్‌ రాజు ప్రొడక్షన్స్) కానీ అంతా ఈజీగా వచ్చింది కాదు. నాకు సినిమా తప్ప ఎలాంటి బిజినెస్‌లు లేవు. ప్రతి నిమిషం సినిమా కోసం పనిచేశా. నాకు సినిమా తప్ప వేరేది ఏది ఎక్కదు. చాలా మంది నన్ను అడుగుతుంటారు. మీరు ఏదైనా  బిజినెస్‌ చేయొచ్చు కదా అని. నాకు సినిమా బిజినెస్‌లు ఉంటే చెప్పండి. అంతే కానీ వేరే వాటి గురించి మాట్లాడొద్దు అని ఒకటే మాట చెబుతా. నేను చచ్చేవరకు సినిమాలే చేస్తా. సినిమా తప్ప నా నోటి నుంచి మరేది రాదు.'‍ అని మాట్లాడారు. కాగా..  ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. 

అనంతరం మాట్లాడుతూ..'హర్షిత్‌ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్‌కు వెళ్లేది. కానీ సినిమా రంగంలోకి వస్తుందని ఊహించలేదు. వీరిద్దరు కలిసి దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా బలగంతో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. లవ్‌ మీతో అరుణ్‌కు ఛాన్స్‌ ఇచ్చారు. మరికొన్ని సినిమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం' అని అన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement