
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఉన్నారు. నిర్మాతగా ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఆయన.. కాస్తా గ్యాప్ రావడంతో విదేశాల్లో విహరిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి వేకేషన్‌లో చిల్ అవుతున్నారు. తాజాగా తన భార్య తేజస్వినితో కలిసి సైకిల్ రైడింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన దిల్ రాజు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో పలు సినిమాలను తెరకెక్కించారు. ఈ ఏడాది విడుదలైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీని దిల్‌రాజు నిర్మించారు. వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయనే నిర్మాత. ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన బ్యానర్‌లో నితిన్ హీరోగా నటించిన తమ్ముడు జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. అంతేకాకుండా ఇటీవలే విజయ్ దేవరకొండతో మూవీ చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు.
