
సినిమా థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే తనవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో తనకు కేవలం ఒక్క థియేటర్ మాత్రమే ఉందన్నారు. స్టాండ్ అలోన్ థియేటర్లకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కూర్చుని మాట్లాడుకోవాలని.. ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ..'రెండు రోజుల నుంచి ఆ నలుగురు అనే వార్తలు వస్తున్నాయి. ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురు అనేది 10 సంవత్సరాలక్రితం ఇప్పుడు 10 మంది పైనే ఉన్నారు. తెలంగాణలో నాకు ఉన్న ఒక్క థియేటర్ ట్రిపుల్ ఏ సినిమాస్ మాత్రమే. ఏపీలో కూడా 15 థియేటర్ల లోపు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. థియేటర్లకు సంబంధించి జరిగిన మూడు సమావేశాలకు నేను వెళ్లలేదు. దయచేసి ఆ నలుగురిలో నన్ను కలపకండి.' అని అన్నారు.