బలగం నటి.. ఇంత గ్లామరస్‌గా మారిపోయిందేంటి? | Tollywood Movie Balagam actress Video Goes Viral | Sakshi
Sakshi News home page

Balagam Movie: బలగం నటి గ్లామర్‌ చూశారా.. ఎవరో గుర్తుపట్టారా?

May 30 2026 7:05 PM | Updated on May 30 2026 7:05 PM

Tollywood Movie Balagam actress Video Goes Viral

ఎంతోమంది నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన మూవీ బలగం. తెలంగాణ పల్లె సెంటిమెంట్‌తో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ పల్లెటూరి సంప్రదాయాలను, రక్త సంబంధాలను ఒక్కసారిగా మళ్లీ గుర్తుకు తెచ్చింది. అచ్చ తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ద్వారా పలువురు నటీనటులు ఫేమస్ అయ్యారు.

అలా ఈ మూవీ ద్వారా ఫేమ్ తెచ్చుకున్నవారిలో రూపాలక్ష్మి ఒకరు. ఈ మూవీలో కొమురయ్య కూతురు లచ్చవ్వగా నటించిన రూపలక్ష్మికి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఆమెను అందరూ తమ ఇంటి ఆడపిల్లగా అక్కున చేర్చుకున్నారు. హీరోయిన్‌ కావ్య కల్యాణ్ రామ్‌కు తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. యితే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్ రామ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే.  బలగం తర్వాత రూపలక్ష్మి మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది.

తాజాగా రూపాలక్ష్మి ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె మరింత గ్లామరస్‌గా కనిపించింది. అసలు బలగం నటి రూపానేనా అన్నంతలా మారిపోయింది. కారు నడుపుకుంటూ వెళ్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  న్యూ జర్నీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

కాగా.. బలగం చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్‌రామ్‌ల‌తో పాటు సుధాక‌ర్ రెడ్డి, న‌ర్సింహ‌, రూప లక్ష్మి, ముర‌ళీధ‌ర్‌ల‌కు చాలా మంచి గుర్తింపు ద‌క్కింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాత‌లుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement