ఆధ్యాత్మిక సేవలో స్టార్ హీరోయిన్.. ఫోటోలు వైరల్! | Sakshi
Sakshi News home page

Samantha: శ్రీవారి సేవలో సమంత.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Published Mon, Mar 4 2024 3:11 PM

Tollywood Heroine Samantha Visits TTD Temple Today - Sakshi

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్‌ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఆ సిరీస్‌ తర్వాత ఎలాంటి సినిమాకు సామ్ సైన్ చేయలేదు. ఇదిలా ఉంటే.. గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా గతేడాది విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ప్రతి రోజు తన ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తోంది. 

తాజాగా సమంత ఆధ్యాత్మిక బాట పట్టారు. తిరుపతికి వెళ్లిన సామ్ శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఇటీవల ఆమె విజయ్ సరసన మరో చిత్రంలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

Advertisement
Advertisement