మంచు వారసుడొస్తున్నాడు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ! | Sakshi
Sakshi News home page

Vishnu Manchu: విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. వారసుడి ఎంట్రీ!

Published Fri, Jan 5 2024 4:05 PM

Tollywood Hero Vishnu Manchu Son Entry Into Movies Confirmed - Sakshi

టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ  సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా కన్నప్ప నుంచి క్రేజీ అప్డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం ద్వారా మంచు వారసుడు సినీ అరంగేట్రం చేయనున్నారు. విష్ణు మంచు వారసుడిగా అవ్రామ్   కన్నప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దీంతో మోహన్‌ బాబు మూడో తరం కూడా సినిమాల్లోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఈ మూవీలో అవ్రామ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించారు. 

విష్ణు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. అవ్రామ్‌తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. 'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు.కన్నప్ప మొదటి షెడ్యూల్ ముగియగానే విష్ణు మంచు తనకు సహకరించిన టీంకు థాంక్స్ చెప్పారు. 

 
Advertisement
Advertisement