
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు.. అక్కడేం చేయాలి? ఎలా సిద్ధంగా ఉండాలి? అవతలివారిని ఎలా ఢీకొట్టాలి? మానసికంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఒక్కరు మాత్రం అవన్నీ పక్కనపెట్టి ఎలా రెడీ అవాలి? తన రాయల్ లైఫ్‌ను ప్రజలకు ఎలా చూపించాలి? అన్నదానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఆవిడే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఎంటర్‌ప్రెన్యూర్ తాన్య మిట్టల్ (Tanya Mittal).
50 కిలోల నగలు
ఈమె ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్‌లో పాల్గొంది. ఈమె బిగ్‌బాస్ హౌస్‌కి ఏకంగా 800 చీరలు తీసుకెళ్లింది. అంతే కాదు, 50 కిలోల నగలను సైతం పట్టుకెళ్లిందట! ఇంత ఆర్భాటం ఎందుకన్న ప్రశ్నకు.. నా లగ్జరీలను నేనెందుకు వదిలేసుకోవాలి? నా చీరలు, నగలు అన్నీ నాతోపాటే తీసుకెళ్తా.. రోజుకు మూడు చీరలైనా కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను అని షోకి వెళ్లడానికి ముందే చెప్పింది. వెండి వస్తువులను కూడా వెంట తీసుకెళ్లింది. ఇలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ తాన్యకు మాత్రమే దక్కడం గమనార్హం!
ఎవరీ తాన్య?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 2000వ సంవత్సరంలో తాన్య మిట్టల్ జన్మించింది. 19 ఏళ్ల వయసులో కేవలం రూ.500తో 'హ్యాండ్‌మేడ్ లవ్ బై తాన్య' పేరిట హ్యాండ్‌బ్యాగ్, నగల బిజినెస్ ప్రారంభించింది. తర్వాత ఇందులో చీరలు అమ్మడం కూడా మొదలుపెట్టింది. 2018లో మిస్ ఆసియా టూరిజం యూనివర్స్ టైటిల్ గెలిచింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 మిలియన్ ఫాలోవర్లున్నారు. బిజినెస్, యాడ్స్ ద్వారా నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోంది.