
మా ఇంట్లో ఎవరమూ బీఫ్ తినము అని చెప్తున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, రచయిత సలీమ్ ఖాన్. ఫ్రీ ప్రెస్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలీం ఖాన్ మాట్లాడుతూ.. మేము ఎన్నడూ బీఫ్ తినలేదు. మా ఇంట్లో ఎవరికీ ఆ అలవాటు లేదు. ఆవుపాలు తల్లిపాలవంటివి అని మా ప్రవక్త బోధనల్లో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి వాటిని సంహరించకూడదు.
ఘనంగా సెలబ్రేషన్స్
హిందూ సాంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా గల్లీలలో హిందూ పండగలను గొప్పగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. చిన్నపెద్ద తేడా లేకుండా అందరూ ఆ వేడుకల్లో పాల్గొనేవాళ్లు. సుశీలతో పెళ్లికి కూడా మా కుటుంబం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. మేము అన్ని పండగలను సెలబ్రేట్ చేసుకుంటాం. అన్నింటినీ గౌరవిస్తాం. అందుకే 60 ఏళ్లుగా సంతోషంగా కలిసున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గణపతిని ఇంట్లో ప్రతిష్టించి పూజించుకున్నాం అని తెలిపాడు.
గణపతి పూజ
కాగా ఇటీవల సల్మాన్ చెల్లెలు అర్పిత ఖాన్ ఇంట్లో గణపతి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో సల్మాన్, అతడి పేరెంట్స్ సలీం- సల్మా (సుశీల) గణనాథుడికి హారతిచ్చారు. ఈ పూజా కార్యక్రమానికి సల్మాన్ కుటుంబసభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు.
— Salman Khan (@BeingSalmanKhan) August 27, 2025
చదవండి: జీవితంపైనే అసహ్యం.. నాకు చావే దిక్కు!: హీరో రెండో భార్య