పదేళ్లకు జోడీ కుదిరింది

Tamannaah to romance Vijay in AR Murugadoss - Sakshi

పదేళ్ల క్రితం విజయ్‌–తమన్నా జంటగా ‘సుర’ అనే తమిళ చిత్రంలో నటించారు. మంచి మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ జంటగా సినిమా చేయలేదు. పదేళ్ల తర్వాత ఈ జోడీ ఒక సినిమాకి కుదిరిందని సమాచారం. హీరో విజయ్‌కి ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్‌’ వంటి హ్యాట్రిక్‌ విజయాలను అందించిన దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఇది విజయ్‌కి 65వ సినిమా కావడం, మురుగదాస్‌–విజయ్‌ కాంబినేషన్‌లో రూపొందే చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోనే విజయ్‌ సరసన తమన్నా కథానాయికగా నటించనున్నారని తెలిసింది. ‘సర్కార్‌’ సినిమాను తెరకెక్కించిన సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, కెమెరా: సంతోష్‌ శివన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top