
కొన్నేళ్ల ముందు వరకు హీరోయిన్‌గా తమన్నా వరస సినిమాలు చేసింది. తర్వాత ట్రెండ్‌కి తగ్గట్లు ఐటమ్ సాంగ్స్ చేసింది. ఓటీటీల్లో పలు సిరీస్‌లు కూడా చేసింది. ఇప్పుడు కూడా ఓ కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. బీర్ తయారు చేయడం బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.
(ఇదీ చదవండి: హీరోయిన్ తో నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్)
పెద్ద కంపెనీలో పనిచేసే తమన్నా ఉద్యోగం ఊడిపోతుంది. ఈమె ఫ్రెండ్‌ది కూడా సేమ్ పరిస్థితి. దీంతో డబ్బు సంపాదించేందుకు బీర్ తయారు చేసి అమ్మాలని నిర్ణయించుకుంటారు. దీని కోసం బీర్ తయారు చేసే ఒకడిని వెతికిపట్టుకుంటారు. తయారు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీళ్లకు సమస్యలు ఎదురవుతుంటాయి. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.
కామెడీ సిరీస్‌లా అనిపిస్తున్నప్పటికీ తమన్నా తన గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఈమెతో పాటు డయానీ పెంటీ, నకుల్ మెహతా, శ్వేత తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కరణ జోహర్ నిర్మించిన ఈ సిరీస్.. సెప్టెంబరు 12 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: వినాయకుడి సాక్షిగా విడాకులపై హన్సిక క్లారిటీ)