'జైలర్‌' హిట్‌ నా వల్లే.. నిర్మాతలకు తమన్నా కొత్త డిమాండ్‌ | Actress Tamannaah Bhatia Interesting Comments On Jailer Movie, Remuneration Hike Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

'జైలర్‌' హిట్‌ నా వల్లే.. నిర్మాతలకు తమన్నా కొత్త డిమాండ్‌

Published Sun, Mar 3 2024 6:45 AM

Tamannaah Bhatia Comments On Jailer Movie - Sakshi

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్‌. ఇందులో నటి తమన్న ఒక్క పాట, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నటించారు. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌ను కూడా తెరకెక్కించడానికి నెల్సన్‌ రెడీ అవుతున్నారు. కాగా నటి తమన్న తన పారితోషికాన్ని విపరీతంగా పెంచేసినట్టు టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ జైలర్‌ చిత్రం అంత సంచలన హిట్‌కు కారణం రజనీకాంత్‌ కాదని, తానేనని పేర్కొన్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో తమన్న నటించిన నువ్వు కావాలయ్యా అనే పాట పెద్ద హిట్‌ అయ్యింది. ఆమె అందాల ప్రదర్శన కర్రకారును విపరీతంగా అలరించింది. చిత్రం విడుదలైన తరువాత ఎక్కడ విన్నా 'నువ్వు కావాలయ్యాస పాటనే. అయితే ఆ పాట హిట్‌ అయినా, తమన్నకు మాత్రం ఇక్కడ మరో అవకాశం రాలేదు. ప్రస్తుతానికి హిందీ చిత్రాలతోనే సరి పెట్టుకుంటున్న ఈ మిల్కీబ్యూటీకి తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశం వరించింది. అది మినహా దక్షిణాదిలో ఒక్క చిత్రం కూడా లేదు.

బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న తమన్న త్వరలో అతగాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ విషయం అలా ఉంచితే ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ. 5 కోట్లకు పెంచేసిందని సమాచారం. అదేమంటే జైలర్‌ చిత్రం హిట్‌కు ప్రధాన కారణం తానేనని చెప్పుకుంటోందట. మరి దీనిపై జైలర్‌ చిత్ర యూనిట్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement