రన్‌ రష్మీ రన్‌

Taapsee gives glimpse of her training session for Rashmi Rocket - Sakshi

రన్నింగ్‌ ట్రాక్‌లో రాకెట్‌లా దూసుకెళ్లాలి అంటే గ్రౌండ్‌లో గంటలు తరబడి కష్టపడాల్సిందే. ప్రస్తుతం అదే చేస్తున్నారు తాప్సీ. ‘రష్మి రాకెట్‌’ సినిమాలో రన్నర్‌గా కనిపించనున్నారామె. ఆకర్‌‡్ష ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడాకారిణి శరీరాకృతి కోసం ఆల్రెడీ డైట్‌ను పూర్తిగా మార్చేశారు తాప్సీ. తాజాగా గ్రౌండ్‌లో శిక్షణకు దిగారు. ఈ పాత్రకు సంబంధించిన శిక్షణలో భాగంగా కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు తాప్సీ. ‘రష్మి పాత్ర కోసం ఎగరడం, దూకడం, పరిగెత్తడం, స్కిప్పింగ్‌... అన్నీ చేస్తున్నాను. ఈ పాత్ర నా మీద కన్నా నా కండరాల మీద తీపి గాయాలు చేస్తోంది’’ అన్నారు తాప్సీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top