తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఏళ్లు గడిచిపోయింది. అయితే ఈ నెల రెండో వారం వచ్చిన 'కరుప్పు'(తెలుగు 'వీరభద్రుడు') ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఇది థియేటర్లలో ఆడుతోంది. ఇంతలోనే మరో మూవీ రిలీజ్ డేట్ ని సూర్య ప్రకటించేశాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
సర్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆకట్టుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి.. సూర్యతో తీసిన మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమిత బైజు హీరోయిన్. సాఫ్ట్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. 40 ఏళ్లు దాటేసిన ఓ వ్యక్తి.. 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడితే అనేది కాన్సెప్ట్. లెక్క ప్రకారం జూలైలోనే తీసుకురావొచ్చని అనుకున్నారు. కానీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ తో ప్రకటించారు.
'కరుప్పు'తో సక్సెస్ అందుకున్న సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడనేది చూడాలి. ఇందులో రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడు.
(ఇదీ చదవండి: ఈ గుండెని తాకిపో తాతా: తారక్ ఎమోషనల్ పోస్ట్)


