జ్యోతిక ఒప్పుకోలేదు.. సూర్య వల్లే అది జరిగింది: డైరెక్టర్‌ | Suriya Convinced Jyothika To Do Rajkummar Rao Srikanth Biopic | Sakshi
Sakshi News home page

జ్యోతిక కుదరదని చెప్తే సూర్య దగ్గరుండి ఒప్పించాడు!

Apr 26 2024 3:28 PM | Updated on Apr 26 2024 6:29 PM

Suriya Convinced Jyothika To Do Rajkummar Rao Srikanth Biopic

జ్యోతిక అస్సలు ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్‌ తుషార్‌ హీరానందని వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ.. నేను జ్యోతిక నటించిన తమిళ సినిమాలు చాలా చూశాను.

బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శ్రీకాంత్‌. ఇది తెలుగువాడి బయోపిక్‌. అంధుడైన శ్రీకాంత్‌ బొల్ల వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడన్నది సినిమాలో చూపించనున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్‌ టీచర్‌ పాత్రలో నటించేందుకు జ్యోతిక మొదట్లో అస్సలు ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్‌ తుషార్‌ హీరానందని వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ.. నేను జ్యోతిక నటించిన తమిళ సినిమాలు చాలా చూశాను.

రిజెక్ట్‌ చేసిన జ్యోతిక
అవన్నీ చూస్తుంటే తను ఒక గొప్ప నటి అనిపించింది. నా సినిమాలో తను యాక్ట్‌ చేస్తే బాగుంటుందనిపించింది. కానీ శ్రీకాంత్‌ బయోపిక్‌లో ఆఫర్‌ను తను రిజెక్ట్‌ చేసింది. తాను చేయలేనని చేతులెత్తేసింది. ఆ మరుసటి రోజు తనే ఫోన్‌ చేసి సినిమాలో యాక్ట్‌ చేసేందుకు అంగీకరించింది. సూర్య స్క్రిప్ట్‌ అంతా చదివాడు.

మిస్‌ చేసుకోవద్దు
ఈ ఛాన్స్‌ అస్సలు మిస్‌ చేసుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అందుకే ఒప్పుకుంటున్నా అని వివరించింది. సూర్య-జ్యోతిక ఇంటికి పిలిచి మరీ ఈ విషయం చెప్పారు. చాలాకాలం తర్వాత హిందీలో ఓకే చెప్పిన సినిమా మాదే.. ఆ తర్వాతే షైతాన్‌ మూవీకి ఓకే చెప్పింది. కానీ మాకంటే ముందు అదే రిలీజైంది' అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

IFrame

చదవండి: గృహప్రవేశం.. భర్తతో పూజ చేసిన మహాతల్లి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement