భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి తన శక్తిని చాటుకుంది. బాహుబలి రాకెట్ (ఎల్‌వీఎం3-ఎం5)ను విజయవంతంగా ప్రయోగించింది. నవంబర్ 2న శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం3-ఎం5 ద్వారా సీఎంఎస్-03 శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ పూర్తిగా భారతదేశంలో తయారుకావడం విశేషం.
రాకెట్ సక్సెస్.. రాజమౌళి హర్షం
ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ సుమారు 4,410 కేజీలు బరువుంది. ఇది భారత భూభాగంతో సహా సముద్ర ప్రాంతంలోనూ అన్ని వేళల్లో సేవలందిస్తుంది. ఈ ఉపగ్రహం దాదాపు 15 ఏళ్ళు పాటు పనిచేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) హర్షం వ్యక్తం చేశాడు.
నిజంగా మాకు గర్వకారణం
అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03 విజయవంతమవడం ఆనందకరం. భారతదేశ శక్తిసామర్థ్యాలను అంతరిక్షంలోనూ చాటిచెప్తున్నందుకు గర్వంగా ఉంది. బాహుబలి.. ఈ పేరుకున్న బలం, దమ్ము అలాంటిది! ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్‌కు బాహుబలి అని పేరు పెట్టడం పట్ల మా బాహుబలి టీమ్ ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇది నిజంగా మాకు గర్వకారణం అని రాజమౌళి ట్వీట్ చేశాడు.
Congratulations to #ISRO on the successful launch of the heaviest communication satellite CMS-03 today! A proud moment for India showcasing our technological strength and self-reliance in space exploration. Onwards and upwards! 🇮🇳🚀
Our entire Baahubali team is elated as @ISRO… pic.twitter.com/Ppcso76Mmu— rajamouli ss (@ssrajamouli) November 2, 2025


