సరిగ్గా ఈ రోజే జీవితం చేజారింది: సోనూ | Sonu Sood Emotional Post On His Mother 13th Death Anniversary | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు: సోనూ

Oct 13 2020 4:32 PM | Updated on Oct 13 2020 4:44 PM

Sonu Sood Emotional Post On His Mother 13th Death Anniversary - Sakshi

‘‘పదమూడేళ్ల కిత్రం సరిగ్గా ఇదే రోజున ... అక్టోబరు 13.. నా చేతుల్లో నుంచి జీవితం చేజారిన వేళ. అమ్మ’’ అంటూ రియల్‌ హీరో సోనూసూద్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి సరోజ్‌ సూద్‌ను గుర్తు చేసుకుంటూ ఆమెకు నివాళులు అర్పించారు. నేడు ఆమె 13వ వర్ధంతి సందర్భంగా ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లి ఫొటోను షేర్‌ చేసిన సోనూ, ఆమెను ఎంతగానో మిస్సవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సరోజ్‌ సూద్‌ ఏ లోకంలో ఉన్నా, మిమ్మల్ని దీవిస్తూనే ఉంటారని, ఇలాంటి కొడుకును కన్నందుకు ఎంతగానో గర్విస్తారంటూ అభిమానులు తమ స్పందన తెలియజేస్తున్నారు. కాగా మహమ్మారి కరోనా కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఎంతో మంది వలస కూలీలకు సోనూసూద్‌ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. సొంత ఖర్చులతో వారిని స్వస్థలాలకు చేర్చి నిజమైన హీరోగా నీరాజనాలు అవతరించారు ఈ రీల్‌ విలన్‌. (చదవండి: మరోసారి పెద్ద మనసు చాటుకున్న సోనూ)

కాగా సోనూ సూద్‌ స్వస్థలం పంజాబ్‌లోని మోగా అన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి శక్తి సాగర్‌ సూద్‌ వ్యాపారం చేసేవారు. తల్లి సరోజ్‌ సూద్‌ ఉపాధ్యాయిని. సోనూకి ఓ సోదరి కూడా ఉంది. తన పేరు మోనికా సూద్‌. ఆమె సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఇక తల్లి పట్ల అవాజ్యమైన ప్రేమ కలిగి ఉన్న సోనూసూద్‌ పలు సందర్భాల్లో ఆమెతో గడిపిన మధుర క్షణాలు, చిన్ననాటి ఫొటోలను అభిమానులతో పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన అభిమాని గీసిన సరోజ్‌ సూద్‌ చిత్రాన్ని షేర్‌ చేసిన సోనూ, ‘‘నువ్వు చూపిన బాటలోనే నడుస్తున్నాను అమ్మా.. ఆ మజిలీ ఎంతదూరంలో ఉన్నా తప్పక దానిని చేరుకుంటాను’’అంటూ తల్లిని తన గురువుగా అభివర్ణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement