బిడ్డ ప్రాణం కోసం కన్నీళ్లతో నిల్చున్న తల్లి.. సోనూ సూద్ సాయం (వీడియో) | Sonu Sood Big Help To A Unhealthy Child | Sakshi
Sakshi News home page

బిడ్డ ప్రాణం కోసం కన్నీళ్లతో నిల్చున్న తల్లి.. సోనూ సూద్ సాయం (వీడియో)

Apr 20 2026 2:58 PM | Updated on Apr 20 2026 3:31 PM

Sonu Sood Big Help To A Unhealthy Child

కన్నబిడ్డను కాపాడుకునేందుకు ప్రతి తల్లి పోరాటమే చేస్తుంది.  దాచుకున్న డబ్బంతా బిడ్డ ఆరోగ్యం కోసమే ఖర్చు చేసిన తల్లి తన బిడ్డను కాపాడాలని నటుడు సోనూసూద్‌ను వేడుకుంది. ఎన్నోచోట్ల ఆసుపత్రిలలో చూపించినా బతకడం కష్టమని చెప్పడంతో ఆమె తల్లడిల్లిపోయింది. సాయం కోసం సోనూ ఇంటవద్ద కన్నీళ్లతో నిల్చుంది. ఆమెను చూసిన సోనూ దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకున్నాడు. ఆ చిన్నారికి మరో జన్మనిచ్చిన దేవుడిలా ఆ కుటుంబానికి నిలిచాడు.

తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీరా అనే చిన్నారి పరిస్థితి తెలుసుకున్న సోనూసూద్‌ వెంటనే స్పందించారు. ముంబైలోని జూపిటర్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో శస్త్రచికిత్స చేయించి ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని అందించారు. ఎన్నో  ఆసుపత్రులను తిరిగిన నీరా తల్లి దాదాపు ఆశ వదులుకుంది. అయితే, సోనూ ముందుకు రావడం ఆపై వైద్యం కోసం సాయం చేయడంతో ఆ చిన్నారి ఊపిరిపోసుకుంది.  అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోనూ ఒక పోస్ట్‌ చేశారు. ఎవరి జీవితంపైనా ఆశ వదులుకోవద్దు. మనం కలిసికట్టుగా నిలబడితే, ఎంతటి కఠినమైన యుద్ధాలనైనా గెలవవచ్చని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement